Thu Dec 26 2024 15:17:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నామినేషన్ల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ లో నిన్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్లను పరిశీలించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో నిన్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో ఇప్పటికే కొందరు అభ్యర్థులు రెబల్ గా బరిలో ఉన్నారు. వారిని ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 572 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
ఉపసంహరణకు...
ఆంధ్రప్రదేశ్ లో 731 అభ్యర్థులు 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికల బరిలో ఉన్నారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారని ఎన్నికల కమిషన్ వార్గాలు వెల్లడించాయి. ఈ నెల 29వ తేదీ వరకూ నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఉంది. మే 13న పోలింగ్ రెండు రాష్ట్రాల్లో జరగనుంది.
Next Story