Mon Dec 23 2024 11:31:18 GMT+0000 (Coordinated Universal Time)
Ap Secratariat : ఫైళ్లన్నీ జాగ్రత్త.. మాయం చేసే అవకాశముంది.. కీలక ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖలో కీలక ఫైళ్లను జారీ చేయవద్దని ఆదేశాలను జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖలో కీలక ఫైళ్లను జారీ చేయవద్దని ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం మారడంతో ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి రోజుల్లో కొన్ని భూకేటాయింపులు చేశారని అనుమానించిన అధికార పార్టీ ఈ మేరకు సూచనలు జారీ చేయడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించిన ఫైళ్లతో పాటు డిజిటల్ ఫైళ్లను కూడా భద్రంగా ఉండేలా చూడాలని కోరారు.
గత ప్రభుత్వంలో...
గత ప్రభుత్వంలో జరిగిన లావాదేవీలపై జరిగిన ఫైళ్లు మాయమయ్యే అవకాశముందని అనుమానించిన అధికార పార్టీ ఈ మేరకు ఉత్తర్వులు రెవెన్యూ శాఖ ద్వారా జారీ చేసింది. ఇప్పటికే ఐటీ శాఖ కు సంబంధించిన కార్యాలయంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పాటు సచివాలయంలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన ఫైళ్లను భద్రంగా ఉండేలా చూడాలన్నారు. ఎవరూ ఫైళ్లను తీసుకెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు ఉత్తర్వులు అందాయి.
Next Story