Mon Dec 23 2024 14:21:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఈరోజు ఎండల తీవ్రత ఎక్కువగా ఎక్కర ఉంటుందంటే?
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ముప్ఫయి మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశముందని విపత్తుల సంస్థ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ముప్ఫయి మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశముందని విపత్తుల సంస్థ తెలిపింది. 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం , పార్వతీపురంమన్యం , అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
వీలయినంత వరకూ...
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని, వృద్దులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
Next Story