Thu Apr 10 2025 05:44:31 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతల పూజలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఆ నేతలు తమ సమీపంలోని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు చంద్రబాబు చేసిన అబద్ధాల ప్రచారానికి ప్రాయశ్చిత్తానికి బదులు పూజలు చేయాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు...
దీంతో వైసీపీ నేతలు తమ పరిధిలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తును ఆలయాల వద్ద ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు మాత్రం ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
Next Story