Mon Dec 23 2024 13:58:22 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సమయంలో మరోవైపు ఎస్మా ను ప్రయోగించడం చర్చనీయాంశమైంది
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సమయంలో మరోవైపు ఎస్మా ను ప్రయోగించడం చర్చనీయాంశమైంది. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి సభ్యులు మరోసారి సమావేశం అయ్యారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించిందనే చెప్పాలి. దీంతో ఈరోజు సమ్మె ఆలోచనను ఉద్యోగ సంఘాలు విరమించుకునే చాన్స్ ఉందని చెబుతున్నారు.
గనుల శాఖలో....
ఈ సమయంలో గనులశాఖలో ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎస్మా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్మాను ప్రయోగించే అత్యవసర సేవలు గనుల శాఖలో ఏం ఉంటాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరో వైపు ఎస్మా పేరుతో రెచ్చ గొడుతుందని ఆరోపిస్తున్నారు.
Next Story