Mon Dec 23 2024 03:03:52 GMT+0000 (Coordinated Universal Time)
ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తెల్లవారుజాము నుంచే పింఛన్లను వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు
వైఎస్సార్ పింఛన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ లో మొదలయింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే పింఛన్లను వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల మొదటి రోజు పింఛన్లను పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెల్లవారు జాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమయిందని పంచాయతీరాజ్, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు.
63.66 లక్షల మందికి...
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 63.66 లక్షల మందికి పింఛన్లను పంపిణీ చేయనున్నారరు. ఇందుకోసం ప్రభుత్వం 1,754.64 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఉదయం ఏడు గంటలకే 15.81 శాతం పింఛ్లను పంపిణీ చేసినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. మొత్తం 10.06 లక్షల మందికి 276.72 కోట్లు వాలంటీర్లు పంపిణీ చేశారని మంతరి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.
Next Story