Sat Nov 23 2024 09:44:15 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేటి నుంచే గ్యాస్ సిలిండర్ బుకింగ్.. ఎలా బుక్ చేసుకోవాలంటే?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దీపావళి రోజు నుంచి ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత సిలిండర్ల పంపిణీకి సంబంధించిన నిధులను విడుదల చేసింది. 869 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని పంపిణీ చేయనున్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు, సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీని తొలుత చేపట్టాలని నిర్ణయించారు.
విధివిధానాలు...
అందుకు అవసరమైన విధివిధానాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది. తెల్ల రంగు రేషన్ కార్డులున్న వారందరూ ఈ పథకం కింద అర్హులైనని ప్రకటించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు ఎవరైనా ఈ పథకం కింద అప్లయ్ చేసుకోవచ్చు. తెలుపు రంగు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా ఉండి తీరాలి. వారు ఏపీలోనే స్థిర నివాసం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లోదాదాపు 1.50 కోట్ల మంది తెల్ల రంగు రేషన్ కార్డుదారులున్నట్లు గుర్తించారు. వీరందరూ దాదాపుగా ఈ పథకం కింద అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం వర్తించని వారు ఎవరైనా ప్రభుత్వం చెప్పిన 1967 టోల్ ఫ్రీ నెంబరుకు కంప్లయిట్ చేయవచ్చు.
ఈరోజు నుంచి...
అయితే ఈరోజు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం పదిగంటల నుంచి తమకు ఎల్పీజీ గ్యాస్ కంపెనీకి బుక్ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. గ్యాస్ బుక్ చేసిన 24 గంటలు లేదా 48 గంటల్లో డెలివరీ అవుతుందని, ఆ తర్వాత వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర మొత్తాన్ని వేయనుంది. అయితే ఇందుకు ముందుగా గ్యాస్ సిలిండర్ ధరను వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం డబ్బులు పంపిన వెంటనే లబ్దిదారుల ఫోన్ కు సమాచారం కూడా అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈరోజు నుంచి బుకింగ్ మొదలవుతుందని అధికారులు తెలిపారు.
Next Story