Tirupathi Stampade : బాబు భలే మేనేజ్ చేస్తాడయ్యా.. సోషల్ మీడియాలో సెటైర్లు
చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఒక దుర్ఘటనను ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.
చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఒక దుర్ఘటనను ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే దుర్ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు మనం చూశాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు దగ్గర నుంచి జేఈవో వరకూ ఆయన దుమ్ముదులిపినట్లు టీవీల్లో మోతమోగిపోగింది. నిజానికి దుర్ఘటన జరగడం దురదృష్టకరమే అయినా అప్పటికప్పుడు ఆయన ప్రజల దృష్టిని మరల్చడానికి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఎప్పుడూ ఇంతే. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం కూడా ఒకింత తగ్గుతుంది. ఇది ఒకరకం టెక్నిక్. ఇక రేపటికి ఈ విషయాన్ని మర్చిపోతారు. జరిగిన దుర్ఘటన కన్నా అధికారులను చంద్రబాబు తిట్టిందే హైలెట్ అవుతుంది. హోంశాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఈ రకమైన కొత్త టెక్నిక్ ను ఆయన అవలంబిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.