Fri Dec 20 2024 11:54:58 GMT+0000 (Coordinated Universal Time)
Nandamuri Balakrishna : అభిమాని చెంప చెళ్లుమనిపించిన బాలయ్య
కదిరిలో నందమూరి బాలకృష్ణ తన అభిమాని చెంప చెళ్లుమనిపించాడు
నందమూరి బాలకృష్ణ అంటే.. ఆయనకు చిరాకు వస్తే అంతే.. కోపం వస్తే కొట్టేస్తాడు. గతంలో అనేక సార్లు తన అభిమానులపైనే చేయి చేసుకునినందమూరి బాలకృష్ణ వార్తలలోకి ఎక్కారు. ఆయనకు ఇది కొత్త కాదు. ఆయన అభిమానులకూ కొత్త కాదు. అందుకే బాలయ్య కొట్టినా దులుపుకుని వెళతారే తప్పించి ఏ మాత్రం బాధపడరు.
సెల్ఫీ దిగేందుకు...
మరోసారి బాలయ్య తన అభిమాని చెంప చెళ్లుమనిపించాడు. కదిరిలో ఆయన ఈరోజు యాత్రకు శ్రీకారం చుట్టారు. కదిరి లో ఆలయంలో పూజలు చేసిన బాలకృష్ణ బయటకు రావడంతోనే ఒక అభిమాని సెల్ఫీకోసం ప్రయత్నించాడు. దీంతో బాలయ్య అతడిని కొట్టడంతో పక్కకు వెళ్లిపోయాడు. కదిరి నుంచి నేడు బాలయ్య సర్వాంధ్ర సాకార యాత్రను రాయలసీమలో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story