Mon Dec 23 2024 07:55:08 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడలో కరోనా భయం : ఇద్దరు మృతి
కాకినాడ జిల్లాలో ఇద్దరు యువకులు కరోనా బారిన పడి మృతి చెందారు
కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఇద్దరు కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. కాకినాడ జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ వార్డులో చికిత్సపొందుతూ ఇద్దరు యువకులు మరణించారు.
చికిత్స పొందుతూ...
వై.రామవరం కి చెందిన 21 ఏళ్ల యువకుడికి కోవిడ్ కారణంగా నిమోనియా సోకిందని వైద్యులు తెలిపారు. అలాగే పెనికేరు గ్రామానికి చెందిన 26 ఏళ్ల మరో యువకుడికి కోవిడ్ సోకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిందని తెలిపారు. కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 46 యాక్టీవ్ కొవిడ్ కేసులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story