Mon Dec 23 2024 17:16:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకాశం పాఠశాలలో కరోనా కలకలం
ప్రకాశం జిల్లా చందలూరు జడ్పీటీసీ పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది.
ప్రకాశం జిల్లా చందలూరు జడ్పీటీసీ పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. మిగిలిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు జ్వరంగా ఉండటంతో కరోనా పరీక్షలుచేయగా అందులో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఆరుగురు విద్యార్థులకు...
వెంటనే వైద్యాధికారుల సూచనల మేరకు వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నారు. పాఠశాల అంతటా శుభ్రం చేశారు. క్లోరినేషన్ చేసి కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. పాఠశాల ప్రాంగణాన్ని ఉన్నతాధికారులు సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story