Tue Apr 15 2025 23:44:36 GMT+0000 (Coordinated Universal Time)
సునీత కాళ్లపై పడిన కార్యకర్త
రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు

రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. తనను క్షమించమని వేడుకున్నారు. తాను వైసీపీలో చేరి తప్పు చేశానని రామాంజనేయులు అనే కార్యకర్త సునీతమ్మ కాళ్ల మీద పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పరిటాల సునీత రాప్తాడు మండలం మరూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తప్పు చేశానంటూ....
2019లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ముచ్చుమర్రి రామాంజనేయులు తాను వైసీపీలో చేరి తప్పు చేశానంటూ సునీతమ్మను వేడుకున్నారు. కళ్ల నీరు పెట్టుకున్నారు. దీంతో సునీత రామాంజనేయులను ఓదార్చారు. రామాంజనేయులు లాంటి కార్యకర్తలకు టీడీపీలో ఎప్పుడూ చోటు ఉంటుందని పరిటాల సునీత తెలిపారు. రామాంజనేయులుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.
Next Story