Mon Dec 23 2024 11:19:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైకోర్టులో కీలక కేసుల్లో తీర్పులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు హైకోర్టు కీలక కేసుల్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే విచారించిన కేసులపై తీర్పు నేడు వెలువరించే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు హైకోర్టు కీలక కేసుల్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే విచారించిన కేసులపై తీర్పు నేడు వెలువరించే అవకాశముంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నేడు తీర్పును ఇచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడులు చేశారు. అందులో వైసీపీకి చెందిన నేతలున్నారని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసులు నమోదు చేసింది. వారంతా ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.
నేతల్లో టెన్షన్...
ఈ నేపథ్యంలో నేడు తీర్పు వెలువరించనుండటంతో ముఖ్యమైన వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇక మరో కేసు చంద్రబాబు ఇంటి పైదాడి కేసు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్ దాడి చేశారని కేసు నమోదయింది దీనిపై కూడా జోగి రమేష్ ను పోలీసులు ఇప్పటికే విచారించారు. జోగి రమేష్ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కూడా నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.
Next Story