Mon Dec 23 2024 15:57:50 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మద్యాన్ని ఐదు రోజుల్లో ఫుల్లుగా తాగేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మద్యం విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఏపీలో మందుబాబులు ఫుల్లుగా తాగేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మద్యం విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఏపీలో మందుబాబులు ఫుల్లుగా తాగేశారు. కేవలం కేవలం నాలుగు రోజుల్లో 541 కోట్ల రూపాయల మందును తాగేశారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలను నూతన పాలసీ విధానాన్ని అమలులోకి తెచ్చిన తర్వాత నూతన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. అన్ని రకాల నాణ్యమైన బ్రాండ్లు మందుబాబులకు వైన్ షాపుల్లోకి తెచ్చారు. దీంతో ఐదేళ్ల తర్వాత అందుబాటులోకి రావడంతో మందుబాబులు పీల్చేశారు.
ఐదు రోజుల్లోనే...
సీసాలకు సీసాలు పట్టించేశారు. కేవలం ఐదు రోజుల్లోనే 6,77,511 లిక్కర్ కేసులు అమ్మకం జరిగాయి. ఇంత భారీ స్థాయిలో గతంలో ఎప్పుడూ అమ్మకాలు జరగలేదని వైన్ షాపుల నిర్వాహకులు తెలిపారు. విపరీతంగా మద్యం దుకాణాలకు మందుబాబులు క్యూ కట్టారు. దీంతో భారీగా ఆదాయం వచ్చింది. ఇంత భారీ స్థాయిలో మద్యాన్ని పూటుగా తాగేశారు. ఇక 99 రూపాయలకే మద్యం బాటిల్ అందుబాటులోకి రాలేదు. అది అందుబాటులోకి వస్తే మరింత మద్యం అమ్మకాలు ఊపందుకుంటాయి.
Next Story