Fri Apr 04 2025 14:08:24 GMT+0000 (Coordinated Universal Time)
బీఏసీలో అచ్చెన్నకు జగన్ బంపర్ ఆఫర్
బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏ అంశంపై చర్చించాలన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహించుకుందామని తెలిపారు. టీడీపీ ఏ అంశంపైనే మాట్లాడలన్నా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అవసరమైతే ఈఎస్ఐ స్కామ్ పై కూడా చర్చిద్దామని జగన్ అన్నారు.
అన్ని అంశాలను...
మీరు సూచించిన 19 అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే చర్చకు మీరు సహకరిస్తారా? లేదా? అన్న విషయాన్ని చెప్పాలని జగన్ అచ్చెన్నాయుడును కోరినట్లు తెలిసింది. కావాల్సినంత సమయం తీసుకోండి. మీరు కూడా మాట్లాడండి. ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉంది. సభలో చర్చకు మాత్రం అడ్డుపడవద్దు అని జగన్ అచ్చెన్నాయుడిని కోరినట్లు సమాచారం.
Next Story