Thu Dec 19 2024 16:33:28 GMT+0000 (Coordinated Universal Time)
Tiger : అల్లదిగో పులి.. ఇవిగో పాదముద్రలు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతంలో పులి సంచారం ప్రజలను భయకంపితులను చేస్తుంది
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతంలో పులి సంచారం ప్రజలను భయకంపితులను చేస్తుంది. పులి ఇక్కడ సంచరిస్తునట్లు గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఈ ప్రాంతంలో పులి పాదముద్రలను పరిశీలించారు. ఇక్కడ పులి తిరుగుతుందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.
అవంతి ఫీడ్ ఫ్యాక్టరీ సమీపంలో...
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతంలో జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ లో అవంతి ఫీడ్ ఫ్యాక్టరీ సమీపంలో పెద్దపులి సంచరిస్తుంది. పులి గాండ్రింపులు కూడా వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పొలాల్లో పులి పాదముద్రలు చూసి ట్రాక్టర్ పైకి ఎక్కిన సమీప కూలీలు గ్రామస్థులకు చెప్పడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Next Story