Mon Dec 23 2024 11:51:30 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : ప్రకాశంలో ఈ భూప్రకంపనలకు కారణమేంటి? ఒకే చోట మూడు రోజులు వరసగా
ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు
ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. ముండ్లమూరు మండలంలో ఈరోజు ఉదయం 10.24 గంటలకు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో బయటే చాలా సేపు వరకూ వేచి ఉన్నారు. అలాగే ఇళ్లలో వస్తువులు కూడా కిందపడిపోవడంతో ప్రజలు ఇలా వరసగా భూమి కంపించడంపై చర్చించుకుంటున్నారు.
మూడు రోజుల నుంచి...
గత మూడు రోజుల నుంచి భూప్రకపంనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. శని, ఆది, సోమవారాలు ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు అలజడి రేపాయి. వరసగా మూడు రోజుల పాటు భూమి కంపించడానికి కారణాలపై అధికారులను అడిగే ప్రయత్నాన్ని అక్కడి వారు తెలుసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలోని కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడంతో ఇక్కడ ఉండటం శ్రేయస్కరమేనా? అన్న అనుమానాలు జనంలో కలుగుతున్నాయి.
అధికారులు ఏమంటున్నారంటే?
అయితే ఇవి భూమి లోపల జరిగే మార్పుల కారణంగానే స్వల్ప కదిలికలు వస్తుంటాయని, ఇది భూకంపం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలు ఎవరూ ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, తమ దైనందిన కార్యక్రమాలను చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా భూమిలో జరిగే మార్పుల కారణంగానే ఈ రకమైన ప్రకంపనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి పెద్దగా ఆలోచించి భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదని అధికారులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story