Mon Dec 23 2024 08:02:06 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : జనసేన అభ్యర్థుల లిస్ట్ ఇదే.. తొలి విడతగా ఐదుగురి పేర్లు ఖరారు
తొలి విడతగా ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు
తొలి విడతగా ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాల్లోనూ, మూడు పార్లమెంంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. తక్కువ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని తాము భావిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని, తొలుత ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని, మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన త్వరలోనే ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
తెనాలి - నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల - లోకం మాధవి
అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
కాకినాడ రూరల్ - పంతం నానాజీ
Next Story