Sun Dec 22 2024 22:09:33 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య డైలాగ్ కు పేర్ని నాని కౌంటర్
వీరసింహారెడ్డి సినిమాలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని
వీరసింహారెడ్డి సినిమాలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ సంతకం పెడితేనే టిక్కెట్లు రేట్లు పెరిగాయని అన్నారు. జగన్ హుందా రాజకీయాలు చేస్తారన్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైన వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని తెలిసినా ఆయన పెద్దగా పట్టించుకోకుండా, సినిమాను సినిమాగానే చూశారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
జగన్ సంతకం పెడితేనే...
సీఎం జగన్ తో మాట్లాడతానని కబురుపెట్టింది నిజం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ సంతకం పెడితేనే టిక్కెట్ల రేట్ల పెంపుదలకు అనుమతిచ్చిన విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు. తిరుమలలో గదుల రేట్లు పెంచడం అవాస్తవమని, పేద, మధ్య తరగతి గదుల ధరలను పెంచలేదని ఆయన స్పష్టం చేశారు. ఆధునికీకరించిన గదులకే రేట్లు పెంచారని, అది కూడా వీఐపీల కోసం కేటాయించేవేనని ఆయన చెప్పారు.
- Tags
- veerasimha reddy
Next Story