Thu Apr 03 2025 14:38:37 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఈరోజు, రేపు టీడీపీలో భారీగా చేరికలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఈరోజు, రేపు టీడీపీలోకి నేతలు చేరికలు కొనసాగనున్నాయి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఈరోజు, రేపు టీడీపీలోకి నేతలు చేరికలు కొనసాగనున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు సమక్షంలో చేరికలు ఉంటాయి. ఈ రోజు కదిరి, ఏలూరు నియోజకవర్గాల నుంచి టీడీపీలోకి వైసీపీ నాయకులు చేరనున్నారు. ఈరోజు ఏలూరుకు చెందిన మాజీ మంత్రి రంగారావు, నాగబోయిన లీలాకృష్ణ, కదిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు చేరనున్నారు.
రేపు కొందరు నేతలు...
రేపు రామచంద్రపురం, తంబళ్లపల్లి నుంచి టీడీపీలోకి నేతలు చేరనున్నారు. పెదకూరపాడు, తాడికొండ నుంచి టీడీపీలోకి చేరనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు కూడా పార్టీలో చేరనున్నారు. ఈ నెల 21న గుణదల మేరీమాత ఆలయాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ నెల 21న పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి.
Next Story