Sun Dec 14 2025 11:48:46 GMT+0000 (Coordinated Universal Time)
Schools Holiday : రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో రేపు కూడా విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో రేపు కూడా విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో రేపు విద్యాసంస్థలు మూసివేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని ఆమె జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున...
కాని ఇంకా మరికొన్ని చోట్ల ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన మంగళవారం కూడా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లకు సెలవులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రేపు కూడా గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లయింది.
Next Story

