Sun Mar 30 2025 04:48:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఏప్రిల్ 4నుంచి ఒంటిపూట బడులు
ఆంధ్రప్రదేశ్ లో ఎండతీవ్రత దృష్ట్యా ఈ నెల 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండతీవ్రత దృష్ట్యా ఈ నెల 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించాయి. మార్చి నెలలోనే భానుడి సెగలు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమయ్యాయి. 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఒంటి పూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది.
వేసవి సెలవుల వరకూ....
ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ మాత్రమే పాఠశాలలను నిర్వహిస్తారు. వేసవి సెలవుల వరకూ ఒంటిపూట బడులు కొనసాగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మంత్రి సురేష్ వెల్లడించారు.
Next Story