Fri Dec 20 2024 01:11:51 GMT+0000 (Coordinated Universal Time)
గర్జనలో కొడాలి నాని
విశాఖ లో వర్షంలోనూ గర్జన ప్రారంభమయింది. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కొడాలి నాని అన్నారు
విశాఖ లో వర్షంలోనూ గర్జన ప్రారంభమయింది. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వర్షంలోనూ వికేంద్రీకరణ కోసం ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వచ్చారన్నారు. ఒక ప్రాంతమే అభివృద్ధి చెందితే ప్రాంతాల మధ్య విధ్వేషాలు పెరుగుతాయన్నారు. ఇక్కడ వారంతా వ్యాపారాలు చేసుకోవడం లేదా? పార్టీని నడిపించడం లేదా? అని కొడాలి నాని ప్రశ్నించారు. ఒక్క అమరావతిలోనే టీడీపీ ఉందా? అని కొడాలి నాని నిలదీశారు
రైతుల యాత్ర కాదది....
లోకేష్ కోసం నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు వంచించారన్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఆ పార్టీని తరిమికొట్టాలని కొడాలి నాని పిలుపు నిచ్చారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమయితే అనేక సమస్యలు వస్తాయన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి రాజధాని రైతుల యాత్ర అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు. రైతుల ముసుగులో ఈ ప్రాంత ప్రజలపై దండయాత్ర చేయడానికి యాత్ర పేరుతో వస్తున్నారని అన్నారు.
Next Story