Mon Apr 21 2025 01:15:19 GMT+0000 (Coordinated Universal Time)
సాయిరెడ్డి కుమార్తె నిర్మాణాల కూల్చివేత
విశాఖపట్నంలో వైసీీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చారు

విశాఖపట్నంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చారు. విశాఖపట్నంలోని భీమిలీ తీరంలో నేహారెడ్డి భవనాలను నిర్మించారు. అయితే ఇవి సీఆర్జడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని నిర్ధారించిన జీవీఎంసీ అధికారులు వాటిని కూల్చివేశారు.
ఉదయం నుంచే....
ఉదయం నుంచే కూల్చివేతలను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ కూల్చివేతలను ప్రారంభించారు. ఇది అక్రమంగా నిర్మించిన నిర్మాణాలని తేలడంతోనే కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే కూల్చివేతలను మాత్రం ఎవరూ అడ్డుకోవడం లేదు. సాయంత్రం వరకూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
Next Story