Thu Dec 12 2024 08:46:26 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యప్ప భక్తులకు షాకిచ్చిన బస్సు డ్రైవర్.. వారిని వదిలేసి వెళ్లి
అయ్యప్ప భక్తులను రోడ్డు మీదనే వదిలేసి బస్సు డ్రైవర్ బస్సుతో సహా వెళ్లిపోయిన ఘటన తిరుపతిలో జరిగింది
అయ్యప్ప భక్తులను రోడ్డు మీదనే వదిలేసి బస్సు డ్రైవర్ బస్సుతో సహా వెళ్లిపోయిన ఘటన తిరుపతిలో జరిగింది. శబరి మలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో తిరుమలకు చేరుకున్న అయ్యప్ప భక్తులు దర్శనం చేసుకోవడానికి తిరుపతి చేరుకున్నారు. అయితే దర్శనం ఆలస్యం కావడంతో వారి లగేజీని కింద పడేసి బస్సు డ్రైవర్ బస్సుతో పాటుపారిపోయాడు, తిరుపతి బాలాజీ బస్టాండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
దర్శనంలేటు అవ్వడంతో...
కావేరి టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు తిరుమలకు వెళ్లారు. అయితే దర్శనం లేట్ కావడంతో డ్రైవర్ భక్తుల లగేజ్ లను కింద పడేసి వెళ్లిపోయాడు. ఇది గమనించిన అయ్యప్ప భక్తులు డయల్ 100 కు కాల్ చేశారు. పోలీసుల చొరవతో నెల్లూరు టోల్ గేట్ వద్ద బస్సు ను ఆపించిన పోలీసులుతిరిగి తిరుపతికి తీసుకువస్తున్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్ లో కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పై అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేశారు.
Next Story