Fri Nov 22 2024 08:31:36 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలులో గాడిదలు మాయం.. గూగుల్ లో వెతికి పట్టుకుని
గూగుల్ లో వెతికి పట్టుకుని తమ గాడిదను తమ సొంతం చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
గాడిదలు కొందరి వృత్తిలో సాయపడతుంటాయి. రజక వృత్తి చేసుకునే వారు గాడిదలను పోషిస్తూ తమ వృత్తిలో సాయంగా మలచుకుంటుంటారు. కర్నూలు జిల్లాలో దొంగిలించిన గాడిద తాడేపల్లిలో దొరికింది. గూగుల్ లో వెతికి పట్టుకుని తమ గాడిదను తమ సొంతం చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన బబ్లూ, శ్రీనివాసరావులకు చెందిన మూడు గాడిదలను కొందరు ఎత్తుకెళ్లిపోయారు.
తాడేపల్లిలో...
బబ్లూ, శ్రీనివాసరావులు కర్నూలు పట్టణంలో ధోభీ వృత్తి చేస్తుంటారు. అయితే తమ ఆస్తిగా భావించే గాడిదలు అపహరణకు గురవ్వడంతో గాడిదలను ఎక్కువగా ఎక్కడ విక్రయిస్తుంటారు అన్న దానిపై గూగుల్ లో వెతికారు. తాడేపల్లిలో ఈ విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయని గుర్తించిన వారు తాడేపల్లికి చేరుకున్నారు. అప్పటికే రెండు గాడిదలను మాసం కోసం విక్రయించారు. ఒక గాడిద మాత్రం ఒక ఇంట్లో దొరికింది. దీంతో వారు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి వారిని ప్రశ్నించగా రెండు గాడిదలను అమ్మేసినట్లు చెప్పారు. మిగిలిన గాడిదను బబ్లూ, శ్రీనివాసరావులకు అప్పగించారు. రెండు గాడిదల విలువ 1.6 లక్షలను వారికి ఇప్పించారు.
Next Story