Mon Dec 23 2024 02:17:57 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమించి పెళ్లి చేసుకుని మరో పెళ్లికి రెడీ.. కారం చల్లి వధువు కిడ్నాప్కు యత్నం
పెళ్లి మండపంలో వధువును కిడ్పాప్ ను చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది
ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు. మరో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో ఇది తెలిసిన అమ్మాయి బంధువులు పెళ్లిమండపంలో ఉన్న వధువును కిడ్నాప్కు చేసేందుకు యత్నించారు. తూర్పు గోదావరి జిల్లా కడయంలో ఈ ఘటన జరిగింది. మరికొద్ది సేపట్లో వివాహం జరగబోతుండగా కారం చల్లుతూ ఫంక్షన్ హాలులోకి ప్రవేశించి వధువును ఎత్తుకెళ్లారు. కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిప్లొమా చదివాడు.
వధువు తరుపున....
అక్కడ కర్నూలు జిల్లా గొడిగనూరు గ్రామానికి చెందిన స్నేహతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఈ నెల 13న విజయవాడలో వివాహం చేసుకున్నారు. కానీ వెంకటనందు పెద్దలు అతనికి మరో వివాహం నిశ్చయించారు. ఈనెల 21న ఆదివారం ముహూర్తం పెట్టుకున్నారు. కానీ ఇది తెలిసిన స్నేహ తనను ప్రమించి మరో యువతితో పెండ్లి చేసుకున్నాడని చెప్పగా వెంటనే స్నేహ తరుపున బంధువులు పెళ్లి జరిగే మంటపానికి వచ్చి అక్కడ ఉన్న వధువును కిడ్నాప్ చేయబోయారు. ఈ ఘటనలో నందుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story