Tue Nov 26 2024 05:09:01 GMT+0000 (Coordinated Universal Time)
రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు.. పెద్దమొత్తంలో నగదును?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలపై ఈ దాడులు కొనసాగుతున్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. నవ్య, రాగమయూరి, స్కంధాన్షి ఇన్ ఫ్రా సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇరవై చోట్ల...
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 20 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున వెంచర్లు ఈ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేశాయి. కానీ ఆదాయపు పన్ను చెల్లించడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
- Tags
- income tax
- rides
Next Story