Sun Dec 22 2024 23:03:39 GMT+0000 (Coordinated Universal Time)
దేవినేని అవినాష్ ఇంటి బయట ఆందోళన
వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి
వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. అయితే దేవినేని అనుచరులు మాత్రం దాడులకు వ్యతిరేకంగా ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కక్ష పూరితంగానే అవినాష్ ఇంటిపై దాడులు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఐటీ అధికారులు వెంటనే వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఒక సామాజికవర్గం కుట్రలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నాయన్నారు.
ఐటీ దాడులకు వ్యతిరేకంగా...
అయితే దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు హార్డ్ డిస్క్ లను లభ్యమయినట్లు తెలిసింది. బంజారాహిల్స్ లోను ఒక భూమికి సంబంధించి సోదాలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఐటీ దాడులు ఉదయం ఆరు గంటల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. దేవినేని అనుచరులు మాత్రం ఇంటి బయట ఆందోళనకు దిగారు. వంశీరామ్ బిల్డర్స్ తో దేవినేని అవినాష్ కు సంబంధించి లావాదేవీలపై ఐటీ శాఖ ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
Next Story