Sun Dec 22 2024 22:27:59 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతల ఇంట్లో ఐటీ సోదాలు
విజయవాడలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేతల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నాయి
విజయవాడలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నాయి. దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఒక భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
వల్లభనేని వంశీ ఇంట్లో....
వంశీరామ్ బిల్డర్స్ కు సంబంధించి కొన్ని పెట్టుబడులు దేవినేని అవినాష్ కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ అంశం సంచలనంగా మారింది. దాదాపుగా 20 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థల్లో జరుపుతున్న దాడుల్లో లభించిన డాక్యుమెంట్లకు సంబంధించిన అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరుగుతున్నాయని తెలిసింది.
Next Story