Mon Dec 23 2024 05:56:13 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తిరుపతిలో ఐటీ దాడులు
తిరుపతిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
తిరుపతిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత కారణాలపై వ్యాపారవేత్త ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో తిరుపతి పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారన్న సంగతి తెలిసి మిగిలిన వ్యాపార వేత్తలు భయపడిపోతున్నారు.
దివాకర్ రెడ్డి ఇంట్లో...
తిరుపతిలోని డాలర్స్ గ్రూప్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు.
Next Story