Mon Dec 23 2024 08:42:30 GMT+0000 (Coordinated Universal Time)
జగన్, చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచిన పోలీసులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాల వద్ద భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు హై ఎలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాల వద్ద భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి, మంగళగిరి వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద పోలీసుల భద్రత పెంచారు. నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ జరగనుండటంతో...
ఎల్లుండి కౌంటింగ్ జరగనుండటంతో భావోద్వేగాలతో దాడులు జరిగే అవకాశముందని భావించిన పోలీస్ శాఖ అప్రమత్తమయింది. కౌంటింగ్ తర్వాత ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటాయన్న సమాచారంతోనే ఈ భద్రతను పెంచినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఎవరైనా అల్లరి మూకలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Next Story