Sat Dec 21 2024 01:53:22 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎంప్లాయీస్ కు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఉద్యోగుల బదిలీల గడువును పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఉద్యోగుల బదిలీల గడువును పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ వరకే బదిలీలు ఉంటాయని తొలుత ప్రభుత్వం పేర్కొంది. ఈరోజుతో గడువు పూర్తవుతుంది. అయితే చాలా శాఖల్లో బదిలీలు పూర్తి కాలేదు. ఉద్యోగ సంఘాలు, జల్లా అధికారుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞపతులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకూ సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదాలు లేకుండా...
ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బదిలీల్లో అర్హతలు, ఖాళీల వివరాలపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 116లో స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. బదిలీలకు సంబంధించి గడువు పెంచడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story