Wed Apr 23 2025 04:16:21 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు విజయవాడకు ఖర్గే.. ఇండియా కూటమి సభ
నేడు విజయవాడలో ఇండియా కూటమి సభ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస అగ్రనేతలు ప్రచారం ముగుస్తున్న సమయంలో పర్యటనలకు వస్తున్నారు. నేడు విజయవాడలో ఇండియా కూటమి సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. విజయవాడలో జరగనున్న జింఖానా గ్రౌండ్స్ లో ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
కమ్యునిస్టు అగ్రనేతలు...
ఈ కార్యక్రమంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ.రాజాలు కూడా హాజరుకానున్నారు. రేపు కడప నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయవాడలో జరిగే సభకోసం కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు పెద్దయెత్తున జనసమీకరణ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
Next Story