Mon Dec 23 2024 05:13:02 GMT+0000 (Coordinated Universal Time)
4న తిరుమలకు రాష్ట్రపతి
ఈ నెల 4వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలకు రానున్నారు
ఈ నెల 4వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలకు రానున్నారు. ఈ నెల 4వతేదీ రాత్రి 9.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుమలలో రాత్రి బస చేస్తారు. అనంతరం 5వ తేదీన ఉదయం 9.25 గంటలకు వరాహ స్వామిని రాష్ట్రపతి దర్శించుకుంటారు.
తిరుపతిలో...
అనంతరం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకుంటారు. ఆ తర్వాత 10. 50 గంటలకు పద్మావతి అతిధి గృహం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరి 11.35 గంటలకు అలిపిరి గోమందిరాన్ని సందర్శిస్తారు. తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
Next Story