Mon Dec 23 2024 12:39:45 GMT+0000 (Coordinated Universal Time)
భవానీలతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. దీక్షను విరమించడానికి పెద్దసంఖ్యలో భవానీలు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు
ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. దీక్షలను విరమించడానికి పెద్ద సంఖ్యలో భవానీలు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. అయితే ఆలయ అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేదని మండి పడుతుననారు. అన్నదానం కూడా ఏర్పాటు చేయలేదని భవానీ దీక్ష చేపట్టిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండి పడుతున్న భవానీలు...
అధికారులు, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అన్నదానానికి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. దాదాపు వంద కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి. దారి మధ్యలోనే హోమగుండం ఏర్పాటు చేయడంతో భక్తులు, భవానీ రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై భక్తులు ఆలయ కమిటీ నిర్వాకం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story