Sat Dec 21 2024 11:04:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
ఇంటర్ పరీక్ష ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు
ఇంటర్ పరీక్ష ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. ఈ ఏడాది 9.99 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ లో 67 శాతం విద్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ లో కృష్ణా జిల్లా మొదటి స్థానం రాగా, రెండో స్థానం గుంటూరు వచ్చింది. ఒకేషనల్ పరీక్షలో 71 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫెయిలయిన వారు...
ఇంటర్ మొదటి సంవత్సరంలో తొలి స్థానం కృష్ణా జిల్లాకు రాగా, రెండో స్థానం గుంటూరు జిల్లా సాధించింది. సప్లిమెంటరీ పరీక్షలు వెంటనే నిర్వహిస్తామని, ఫెయిలయిన విద్యార్థులు నిరాశ పడవద్దని, ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని, సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయి సంవత్సరం వృధా కాకుండా చూసుకోవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు కూడా ఫెయిల్ అయిన విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయాలని అన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
Next Story