Sat Dec 21 2024 11:06:53 GMT+0000 (Coordinated Universal Time)
పరీక్ష హాల్లో ఇంటర్ విద్యార్థి మృతి.. విషాదం
పరీక్షలు రాస్తూ ఎగ్జామ్ హాల్లోనే విద్యార్థి కుప్పకూలి చనిపోయాడు. తిరుపతి జిల్లా గూడూరులో ఈ ఘటన జరిగింది.
పరీక్ష కేంద్రంలోనే ఇంటర్ విద్యార్థి కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. సైదాపురానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి సతీష్(18) పరీక్ష రాసేందుకు గూడూరులోని డీఆర్డబ్ల్యూ పరీక్ష కేంద్రానికి వచ్చాడు. పరీక్ష రాస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కంగారుపడిన ఉపాధ్యాయులు, విద్యార్థులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో తోటి విద్యార్థులు నిశ్చేష్టులయ్యారు. కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు భావిస్తున్నారు.
Next Story