Mon Dec 23 2024 02:57:47 GMT+0000 (Coordinated Universal Time)
ఐటీ దాడుల్లో విస్తుపోయే నిజాలు.. 800 కోట్ల లావాదేవీలు?
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. మొత్తం నాలుగు రోజుల పాటు దాడులు చేసిన అధికారులకు 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నవ్యా డెవెలపర్స్, రాగమయూరి ఇన్ ఫ్రా, స్కంధాన్షి ఇన్ ఫ్రా సంస్థల్లో పెద్దయెత్తున ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. మొత్తం నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.
మూడు సంస్థల్లో....
అయితే ఈ మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో దాదాపు 800 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, విశాఖ, కడప, నంద్యాల, బళ్లారిలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. పెద్దయెత్తున వ్యాపారం చేసినా ఆదాయపుపన్ను చెల్లించకుండా తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు సోదాల్లో బయటపడింది. ఆదాయపు పన్ను శాఖకు దొరకకుండా సాఫ్ట్ వేర్ ను ధ్వంసం చేసినట్లు కనుగొన్నారు. అదే సమయంలో లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేసుకున్నారు. బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరపకుండా ప్రత్యేక విధానాలను వీరు అవలంబించారు.
Next Story