Sun Dec 22 2024 12:54:46 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎస్ అధికారి విశాల్గున్నికి బిగ్ రిలీఫ్
ఐపీఎస్ అధికారి విశాల్గున్నికి హైకోర్టులో ఊరట లభించింది. ముంబయి నటిని వేధించిన కేసులో ఆయనకు రిలీఫ్ దక్కింది
ఐపీఎస్ అధికారి విశాల్గున్నికి హైకోర్టులో ఊరట లభించింది. ముంబయి నటిని వేధించిన కేసులో ఆయనకు రిలీఫ్ దక్కింది. అక్టోబరు 1వ తేదీ వరకూ విశాల్ గున్నిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో విశాల్ గున్నికి రిలీఫ్ కొంత కాలం లభించనట్లే.
ముంబయి నటి కేసులో...
ముంబయి నటిని వేధించి అక్రమ కేసులు నమోదు చేశారంటూ విశాల్ గున్నిపై ఆరోపణలు రావడంతో పాటు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తనను అరెస్ట్ చేయవద్దంటూ విశాల్ గున్ని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు దీనిపై విచారణ జరిగింది. అక్టోబరు 1వ తేదీకి విచారణ వాయిదా పడింది.
Next Story