Fri Dec 20 2024 17:52:42 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి కొడాలినాని మరో సవాల్
చంద్రబాబుకు పదిరోజుల సమయం ఇస్తున్నానని, ఈలోగా నిరూపించలేకపోతే చంద్రబాబు ఆత్మహత్య చేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు
చంద్రబాబుకు పదిరోజుల సమయం ఇస్తున్నానని, ఈలోగా నిరూపించలేకపోతే చంద్రబాబు ఆత్మహత్య చేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. గుడివాడలోని తన కన్వెన్షన్ సెంటర్ లో ఎలాంటి జూదం జరగలేదని కొడాలి నాని పునరుద్ఘాటించారు. తన కల్యాణమండపంలో అలాంటివి ఏవీ జరగలేదని చెప్పారు. తన కల్యాణ మండపంలో సీసీ కెమెరాలున్నాయని, వాటి ఫుటేజీని తాను విడుదల చేస్తానని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆయన కుల మీడియా తనపై ఎన్ని ఆరోపణలు చేసినా తనను ఏం చేయలేరని నాని తెలిపారు.
బాబుకు పదిరోజుల డెడ్ లైన్....
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు క్లబ్ లను నడిపి వందల కోట్లను సంపాదించారని, దీనివెనక లోకేష్ ఉన్నారని నాని ఆరోపించారు. చిన్న చిన్న ఫంక్షనలోనూ ఈరోజుల్లో రికార్డింగ్ డ్యాన్స్ లు నిర్వహిస్తున్నారని, తన కల్యాణ మండపంలో జరిగితే తప్పేంటని నాని ప్రశ్నించారు. టీడీపీ మీటింగ్ లలోనూ చంద్రాబాబును పొగుడుతూ పాటలను పెట్టలేదా? అని నిలదీశారు. తాను వైసీపీిలో ఉన్నాననే తనపై బురద చల్లే కార్యక్రమాన్ని టీడీపీీ దాని అనుకూల మీడియా ప్రారంభించిందన్నారు. పదిరోజుల్లో తన కల్యాణ మండపంలో క్యాసినో ఏర్పాటు చేస్తానని రుజువు చేస్తే తాను విసిరిన ఛాలెంజ్ కు కట్టుబడి ఉన్నానని నాని తెలిపారు.
Next Story