Sat Jan 04 2025 23:11:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పీఎస్ఎల్వీ 60 ప్రయోగం
నేడు పీఎస్ఎల్వీ 60 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు
నేడు పీఎస్ఎల్వీ 60 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ థావన్ సెంటర్ నుంచి రాత్రి 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళుతుంది. నిన్న రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఈ ప్రయోగంతో మరొక పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేసినట్లవుతుందని వెల్లడించారు.
సవాలుగా తీసుకుని...
ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని సవాలుగా తీసుకుని రూపొందించారు. నానో శాటిలైట్ లను కక్షలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపనున్నారు. మానవ అంతరిక్షయానం, ఫార్మేషన్ ఫ్లయింగ్, స్పేస్ డాకింగ్ వంటి వాటికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు ఉపగ్రహాల బరువు 44 కిలోలుగా ఉందని చెప్పారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story