Mon Dec 23 2024 16:14:43 GMT+0000 (Coordinated Universal Time)
త్రీ క్యాపిటల్స్ ఇష్యూ పై నేడు హైకోర్టులో?
మూడు రాజధానుల అంశంపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది
మూడు రాజధానుల అంశంపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ దాదాపు 73 వరకూ పిటీషన్లు వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను, సీఆర్డీఏ రద్దు బిల్లులను రద్దు చేసిట్లు ప్రకటించింది.
నేటి విచారణలో....
తాము బిల్లులను ఉపసంహరించుకున్న విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేసింది. అయితే అసెంబ్లీలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ మార్పులు చేసి కొత్త బిల్లులను తెస్తామని ప్రకటించారు. దీంతో నేడు హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఏం చెప్పనుంది? న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story