Mon Dec 23 2024 15:40:48 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆగిపోయిన కులధృవీకరణ సర్టిఫికేట్ల జారీ..!
ఏ సామాజిక వర్గానికి చెందిన వారు కులధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినా వారికి ఎస్టీ సర్టిఫికేట్ వస్తోంది. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి
ఏపీలో కులధృవీకరణ సర్టిఫికేట్ల జారీ ఆగిపోయింది. ఏ కులంవారికైనా ఎస్టీ సర్టిఫికేటే వస్తోంది. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ఇలా జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారు కులధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినా వారికి ఎస్టీ సర్టిఫికేట్ వస్తోంది. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సర్టిఫికేట్ల జారీని నిలిపివేశారు.
Also Read : టీడీపీ నేత దేవినేని ఉమా అరెస్ట్
రెండ్రోజులుగా రాష్ట్రంలో కుల ధృవీకరణ పత్రాల జారీ ఆగిపోయింది. ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన షేక్ షబ్బీర్ అనే వ్యక్తి కులధృవీకరణ పత్రం కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే.. అతను షేక్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూనే ఎస్టీ సర్టిఫికెట్ జారీ అయింది. మాల సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు కూడా ఎస్టీ సర్టిఫికెట్ వచ్చింది. ఇలా అన్ని చోట్లా సాంకేతిక సమస్యలతో ఒకటే సర్టిఫికేట్ వస్తోంది. కాగా.. కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అవుతోందని, ఆ ప్రక్రియ పూర్తవ్వగానే సర్టిఫికేట్లను జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
Next Story