Wed Jan 08 2025 19:17:33 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన కేసు కక్ష సాధింపేనా? ఈడీ పరోక్షంగా చెప్పిందదేనా?
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదని తేలింది
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పష్టం చేశారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో తాజాగా సీమెన్స్ సంస్థ ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 23 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. అయితే ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. చంద్రబాబుకు అతి పెద్ద ఊరటగా చెప్పవచ్చు. తాను నిర్దోషిగా బయటపడతానని చంద్రబాబు జైలుకు వెళ్లేటప్పుడే చెప్పిందే నిజమయినట్లు కనిపిస్తుంది.
రాజమండ్రి జైలు వల్లనే...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబును జైలులో వేయడమే ఆయనకు రాజకీయంగా లాభించిందని చెప్పవచ్చు. ప్రజల్లో సానుభూతి బలంగా వీచింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేసింది కూడా రాజమండ్రి జైలు బయటే. అందుకే ఈ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసు ఒకరకంగా చంద్రబాబును ప్రజల్లో దోషిని చేయలేదు. సానుభూతిని తెచ్చిపెట్టింనే చెప్పాలి. ఏడు పదుల వయసులో ఆయనను అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులంతా ఏకమైంది కూడా ఈ ఘటన తర్వాత మాత్రమే.
ఎక్కడా అవినీతి ఆధారాలు లేవని...
కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ఈకేసులో చంద్రబాబుకు సంబంధం లేదని చెప్పడం అతి పెద్ద ఊరట అని చెప్పాలి. ఈ కేసులో సుమన్ బోస్, వినాయక్ ఖాన్వెల్కర్ లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి నగదును తమ సొంత ఖాతాల్లోకి బదలాయించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈడీ స్టేట్మెంట్ లో చంద్రబాబు పేరు అసలు ప్రస్తావనకు రాలేదు. ఆయన అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు కూడా లభించలేదని ఈడీ ఆధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. దీంతో స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం అనవసరంగా ఇరికించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
రాజకీయంగా బలంగా..
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఎక్కడా డబ్బులు అందినట్లుగా కూడా ఆధారాలు లభించలేదని ఈడీ అధికారులు తెలిపారు. మరోవైపు చంద్రబాబునాయుడు ఇప్పుడు కేంద్రంలో బలంగా ఉన్నారు. ఆయన మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంది. అందుకే చంద్రబాబును టచ్ చేసే పరిస్థితి ఏ కేంద్ర దర్యాప్తుసంస్థకు ఉండదు. అది బీజేపీ రాజకీయ అవసరం కావచ్చు. చంద్రబాబును నిత్యం మచ్చిక చేసుకునే పనిలోనే కేంద్రం ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. అందుకే స్కిల్ డెవలెప్మెంట్ కేసులో గతంలో జరిగిన అరెస్ట్లు, ఆరోపణలపై నాటి ప్రభుత్వానికి మాయని మచ్చఅనే చెప్పాలి. ఏపీ సీఐడీపై కూడా ఈ కేసుకు సంబంధించి కొంత రాజకీయవత్తిడి వల్లనే నాడు చంద్రబాబును అరెస్ట్ చేశారన్న ఆరోపణలకు ఈడీ స్టేట్మెంట్ అద్దం పడుతుంది.
Next Story