Fri Dec 20 2024 08:04:53 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మంత్రులకు వార్నింగ్
పనిచేయని మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.
పనిచేయని మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. గెలుపును బట్టే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయంపు ఉంటుందని, అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా చూడబోమని ఆయన అన్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి వర్గం సమావేశం అనంతరం ఆయన ప్రత్యేకించి మంత్రులతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్తో ప్రజల్లో ఎటువంటి సానుభూతి రాలేదన్నారు. అలాగే ఆయన బెయిల్ పై విడుదలయినప్పుడు కూడా రెస్పాన్స్ కేవలం పార్టీ క్యాడర్ కే పరిమితమయిందని, సామాన్య జనం పట్టించుకోలేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
కేబినెట్ ఆమోదించిన...
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కులగణనకు ఏపీ కేబినెట్ ఓకే చెప్పింది. జగనన్న సురక్ష కార్యక్రమం బాగా జరుగుతుందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అభిప్రాయపడింది. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐదేళ్లు వరసగా అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. అణగారిన వర్గాల అభివృద్ధికి కులగణన మరింత ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.
Next Story