Sun Dec 22 2024 21:49:00 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురి అరెస్ట్?
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు మూడేళ్ల క్రితం దాడి చేసి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అప్పటి ప్రభుత్వం ఎవరీనీ అరెస్ట్ చేయలేదు. కేసులు నమోదు చేయలేదు. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే దాడి చేసిన వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరిశీలించి వారి కోసం గత రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టింది.
కార్పొరేటర్లను కూడా...
నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు వారి కోసం వెదుకుతున్నాు. ఆధారాలను సేకరించిన పోలీసులు కొందరిన రాత్రి అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది గుంటూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలుగా గుర్తించారు. వీరిలో కొందరు గుంటూరుకు చెందిన వైసీీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారని సమాచారం. ఈ దాడిలో పాల్గొన్న వారి కోసం ఇంకా పోలీసులు వెదుకుతున్నారు.
Next Story