Mon Dec 23 2024 08:06:03 GMT+0000 (Coordinated Universal Time)
కోట్ల రూపాయల హవాలా.. ఆ బస్సులోనే?
ద్మావతి ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా రూపంలో వ్యాపారులు నగదును పంపుతున్నారని సమాచారం.
ఏపీలో అతిపెద్ద హవాలా ర్యాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పద్మావతి ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా రూపంలో వ్యాపారులు నగదును పంపుతున్నారని సమాచారం. ఈరోజు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు జరిపిన దాడుల్లో పద్మావతి ట్రావెల్స్ బస్సుల్లో కోట్ల రూపాయల నగదుతో పాటు కేజీల కొద్దీ బంగారం లభ్యమయింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పద్మావవతి ట్రావెల్స్ ఉత్తరాంధ్ర కేంద్రంగా తమ వ్యాపారులను నిర్వహిస్తుంది.
విజయవాడలో సోదాలు....
పెద్దయెత్తున నగదును స్వాధీనం చేసుకున్న తర్వాత విజయవాడ పద్మావతి ట్రావెల్స్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బస్సులో ఉంచే వస్తువులపై ఆరా తీశారు. బస్సులు ఎన్నింటికి బయలుదేరుతాయి? ఎన్నింటికి వస్తాయి? అన్న వివరాలతో పాటు ఏ ఏ ప్రాంతాలకు బస్సులు వెళతాయన్న దానిపై పోలీసులు పద్మావతి ట్రవెల్స్ కార్యాలయం గుమాస్తాల నుంచి వివరాలు సేకరించారు.
బంగారం వ్యాపారులు.....
ప్రధానంగా బంగారం వ్యాపారులు ఈ నగదును పెద్దయెత్తున పంపినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన బంగారం వర్తకులు నగదును పంపి దానికి బంగారం తెప్పిచుకుంుటున్నట్లు గుర్తించారు. ఎలాంటి రశీదులు లేకుండా ఈ నగదును బంగారం వ్యాపారులు పంపుతున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన బంగారం వర్తకులతో ఒప్పందం కుదుర్చుకుని సేఫ్ పద్ధతిలో నగదును తరలించడానికి పద్మావతి ట్రావెల్స్ ను బంగారం వ్యాపారులు ఎంచుకున్నారని తెలిసింది.
Next Story