Thu Dec 12 2024 10:32:25 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భారీ వర్షం.. ఘాట్ రోడ్డులో అప్రమత్తంగా ఉండాలంటూ
తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చలితీవ్రత పెరగడంతో భక్తులు వణుకుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో తిరుమలలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో భక్తులు తిరుమల దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఘాట్ రోడ్డులో ప్రయాణం...
అయితే ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సూచిస్తున్నారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేశారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.ఇప్పటికే గోగర్భం, పాపవినాశనం పూర్తిగా నిండిపోయింది.
Next Story