Mon Dec 23 2024 16:32:22 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్లు చెబుతున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో దాదాపు నెల రోజులకు పైగానే రాజమండ్రి కేంద్ర కారాగారాంలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు తనకు అస్వస్థతగా ఉన్నట్లు జైలు అధికారులకు తెలిపారు. వేడి, ఉక్కపోతతో డీహైడ్రేషన్ కు గురైనట్లు ఆయన తెలిపారు.
అలాంటిదేమీ లేదు...
నిన్న చంద్రబాబును కలసిన కుటుంబ సభ్యులతో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. దీనిపై వారు ఆందోళన చెందుతున్నారు. అయితే అటువంటిదేమీ లేదని ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని జైలు సూపరింటెండెంట్ కె.ఎల్.రాహుల్ తెలిపారు. చంద్రబాబుకు మూడు సార్లు రోజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన ఆరోగ్యం బాగానే ఉందని రాహుల్ తెలిపారు.
Next Story